హిందీ స్మాల్ స్క్రీన్ పై “పుష్ప” మాస్ రీచ్ వైరల్.!

హిందీ స్మాల్ స్క్రీన్ పై “పుష్ప” మాస్ రీచ్ వైరల్.!

Published on Jun 18, 2022 3:02 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ చిత్రం “పుష్ప”. పాన్ ఇండియా లెవెల్లో భారీ హిట్ గా మాత్రమే నిలవకుండా ఎనలేని రీచ్ ని ఈ చిత్రం తెచ్చుకుంది. తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ చేసిన మ్యానరిజం గాని సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన చార్ట్ బస్టర్ సాంగ్స్ ని నెక్స్ట్ లెవెల్ లోకి వెళ్లిపోయాయి.

లేటెస్ట్ గా అయితే హిందీ స్మాల్ స్క్రీన్ పై ఓ డాన్స్ షో లో పుష్ప సామి సామి సాంగ్ కి ఇద్దరు చిన్నారులు సాలిడ్ పెర్ఫామెన్స్ చేయగా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ షోలో అనిల్ కపూర్, కియారా అద్వానీ తదితర బాలీవుడ్ సెలెబ్రెటీ లు ఈ సాంగ్ ని చూసి మెస్మరైజ్ అయ్యిపోయారు. దీనితో పుష్ప యూనిట్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు