“పుష్ప” మాసివ్ ప్రీ రిలీజ్ పార్టీ కి డేట్ ఫిక్స్!

Published on Dec 9, 2021 9:45 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. మొదటి భాగం ఈ నెల 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం లో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్ర లో నటించడం జరిగింది. ఈ చిత్రం లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇటీవల విడుదలైన చిత్ర ట్రైలర్ సైతం ప్రేక్షకులని అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా లో మలయాళ నటుడు ఫాహద్ ఫజిల్ విలన్ పాత్రలో నటిస్తుండగా, సునీల్, అనసూయ భరద్వాజ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రి రిలీజ్ వేడుక పై తాజాగా ఒక క్లారిటీ వచ్చింది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక ను డిసెంబర్ 12 వ తేదీన జరపనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. పుష్ప మాసివ్ ప్రీ రిలీజ్ పార్టీ అంటూ చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ కాంబో లో వస్తున్న చిత్రం కావడంతో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :