ప్రీరిలీజ్‌ వేడుకలో ‘పుష్ప’.. అంచనాలు పెరుగుతున్నాయి !

Published on Dec 12, 2021 7:55 pm IST

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న మాస్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పుష్ప’. కాగా ఈ చిత్రం ఫస్ట్‌ పార్ట్‌ డిసెంబరు 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ పోలీస్‌ గ్రౌండ్స్‌ లో ప్రీరిలీజ్‌ వేడుకను నిర్వహిస్తున్నారు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ అందర్నీ బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా బన్నీ చెప్పిన డైలాగ్స్ చాలా బాగున్నాయి.

‘పుష్ప అంటే ప్లవర్ అనుకున్నావా.. ఫైర్’ అంటూ బన్నీ చెప్పగానే బ్లాస్ట్ విజువల్స్ రావడం చాలా బాగా ఆకట్టుకుంది. దాంతో బన్నీ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ లోనూ ఈ సినిమా పై అంచనాలు పెరిగాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

అయితే, హైదరాబాద్‌ పోలీస్‌ గ్రౌండ్స్‌ లో జరుగుతున్న ‘పుష్ప’ చిత్రం ప్రీరిలీజ్‌ వేడుక కార్యక్రమాన్ని మీరు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించొచ్చు.

సంబంధిత సమాచారం :