మాసివ్ సక్సెస్ పార్టీ కి సిద్ధమవుతోన్న పుష్ప టీమ్!

Published on Dec 20, 2021 2:57 pm IST

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్. ఈ చిత్రం విడుదల అయ్యి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. విడుదల అయిన అన్ని చోట్ల మంచి వసూళ్ళను రాబడుతూ దూసుకు పోతుంది పుష్ప. ఈ చిత్రం ఘన విజయం సాధించడం పట్ల చిత్ర యూనిట్ మాసివ్ సక్సెస్ పార్టీ ను జరుపుకునేందుకు సిద్దం అవుతోంది.

తిరుపతి లోని ఎస్వీ యూనివర్సిటీ స్టేడియం లో రేపు సాయంత్రం 6 గంటలకు ఈ సక్సెస్ పార్టీ జరగనుంది. ఇందుకు సంబంధించిన పనులు తాజాగా ప్రారంభం అయ్యాయి. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం లో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా రష్మిక మందన్న నటించగా, సునీల్, అనసూయ భరద్వాజ్, ఫాహద్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన రెండవ పార్ట్ పుష్ప ది రూల్ వచ్చే ఏడాది సెట్స్ మీదికి వెళ్లనుంది.

సంబంధిత సమాచారం :