పుష్ప పై పెరుగుతున్న భారీ అంచనాలు!

Published on Dec 12, 2021 7:32 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ మరియు ముత్తంశెట్టి మీడియా లు కలిసి ఈ చిత్రాన్ని సంయుక్తం గా నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా, సమంత ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు విడుదల అయ్యి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ సైతం ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ చిత్రం కి సంబంధించిన టికెట్స్ ఆన్లైన్ లో అందుబాటులోకి వచ్చిన కొద్ది సేపటికే మొదటి రోజు టికెట్స్ అన్ని అమ్ముడు పోయాయి. నిమిషాల్లో ఈ తరహా బుకింగ్స్ ఉండటం తో సినిమా పై ఏ తరహా ఆసక్తి ఉందో అర్థం అవుతుంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం లో మలయాళ నటుడు ఫాహద్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. సునీల్ మరియు అనసూయ భరద్వాజ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :