బ్లాక్ బస్టర్ పుష్ప మేకింగ్ వీడియో రిలీజ్!

Published on Dec 26, 2021 9:02 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం పుష్ప ది రైజ్. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగం పుష్ప ది రైజ్ డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి భారీ వసూళ్లను రాబడుతోంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతూ బ్లాక్ బస్టర్ విజయం సాధించడం జరిగింది. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ గా విడుదల కావడం తో సినిమా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ వీడియో లో సినిమా లో నటించిన నటీనటులతో పాటుగా, సినిమా కోసం పని చేసిన సాంకేతిక నిపుణులను కూడా చూపించడం జరిగింది. భారీ వసూళ్లను రాబడుతోన్న పుష్ప, లాంగ్ రన్ లో ఏ రేంజ్ వసూళ్లను రాబడుతుందో చూడాలి. ఈ చిత్రం రెండవ భాగం పుష్ప ది రూల్ వచ్చే ఏడాది మార్చ్ లేదా ఏప్రిల్ లో సెట్స్ పైకి వెళ్లనుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :