ఓటీటీలోకి “పుష్ప”.. ఆ డేట్ ఫిక్స్ అయ్యిందా?

Published on Jan 4, 2022 1:14 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియన్ లెవల్లో తెరకెక్కించిన చిత్రం “పుష్ప ది రైజ్”. డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం అన్ని చోట్ల బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుని రికార్డ్ స్థాయిలో వసూళ్లను రాబడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే రూ.300కోట్ల ట్రేడ్‌ మార్క్‌ను కూడా దాటేసింది.

అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్‌ వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా తొందరలోనే ఓటీటీలోకి రాబోతుందట. జనవరి 7న “ఆర్‌ఆర్‌ఆర్‌” విడుదల కావాల్సి ఉండగా, ఆ సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్‌ఆర్‌ఆర్‌ డేట్‌ను క్యాష్‌ చేసుకోవాలని భావిస్తూ జనవరి 7న “పుష్ప” సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ చేయాలని యూనిట్ భావిస్తుందట. అయితే త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్ రానుందట.

సంబంధిత సమాచారం :