పుష్ప పార్ట్-2 లో అదిరిపోయే ట్విస్ట్?

Published on Jan 25, 2022 4:00 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం “పుష్ప ది రైజ్”. డిసెంబర్ 17వ తేదిన విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుని భారీ వసూళ్లను రాబట్టుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లోనూ స్ట్రీమింగ్ అవుతుంది. అయితే పార్ట్ 1 “పుష్ప ది రైజ్” భారీ హిట్ అవ్వడంతో.. ఇప్పుడు పార్ట్ 2 “పుష్ప ది రూల్”పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ఇదిలా ఉంటే “పుష్ప ది రూల్”కి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ”పుష్ప: ది రూల్” చిత్రంలో ఓ అదిరిపోయే ట్విస్ట్ ఉండబోతుందట. పార్ట్ 1లో పుష్ప పక్కన ఉండే కేశవాకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అయితే పార్ట్ 2లో పుష్పకి కేశవా వెన్నుపోటు పొడుస్తాడని, దాంతో పుష్ప కొత్త చిక్కుల్లో పడతాడని టాక్ నడుస్తుంది. అదే సమయంలో పార్ట్ 1లో విలన్స్ గా చూపించిన జాల్ రెడ్డి, మంగళం శీను.. అతని భార్య దాక్షాయణి పుష్పపై ప్రతీకారం తీర్చుకుంటారని, వీరందరితో పాటు షికావత్ సార్ కూడా పుష్పై పగ తీర్చుకుంటాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరీ ఇందులో ఎంతవరకు నిజముందనేది తెలియాలంటే పార్ట్ 2 వచ్చేవరకు వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :