పుష్ప నుండి విడుదలైన సరికొత్త ప్రోమో సాంగ్స్!

పుష్ప నుండి విడుదలైన సరికొత్త ప్రోమో సాంగ్స్!

Published on Dec 12, 2021 11:18 PM IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. పుష్ప ది రైజ్ పేరిట మొదటి భాగం డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ చిత్రం కి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం జరిగింది. ఈ వేడుక లో పుష్ప టీమ్ తో పాటుగా, పలువురు ప్రముఖుల హాజరు కావడం విశేషం.

ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలకి విశేష స్పందన వస్తోంది. తాజాగా ఈ చిత్రం నుండి సామీ సామీ ప్రోమో సాంగ్ మరియు ఊ అంటావా ఊ ఊ అంటావా సాంగ్ ప్రోమో లు విడుదల అయ్యాయి. ఈ వీడియో లకు విశేష స్పందన లభిస్తోంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా, సమంత స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. ఈ చిత్రం లో అనసూయ భరద్వాజ్, సునీల్, ఫాహద్ ఫజిల్ లు కీలక పాత్రల్లో నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ మరియు ముత్తం శెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ప్రోమో సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు