పుష్ప: సమంత ఐటెం సాంగ్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేశారంటే?

Published on Dec 15, 2021 9:46 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ “పుష్ప”. డిసెంబర్ 17వ తేదిన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో సమంత ఐటం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. అంటూ సమంత చిందేసిన ఈ పాట యూట్యూబ్‌లో ఇప్పటికే 45 మిలియన్స్‌కి పైగా వ్యూస్‌తో దూసుకుపోతుంది.

అయితే ఈ స్పెషల్ సాంగ్ కోసం మేకర్స్‌ దాదాపు రూ.5 కోట్ల వరకు ఖర్చుపెట్టారని తెలుస్తుంది. ఈ సాంగ్‌ కోసం సమంతకు సుమారు కోటిన్నరకు పైగా ముట్టచెప్పారని తెలుస్తుంది. అంతేకాకుండా భారీ సెట్టింగ్‌తో విజువల్‌ వండర్‌గా ఈ పాటను తెరకెక్కించారని, సినిమాలో ఈ స్పెషల్‌ సాంగ్‌ హైలెట్‌గా నిలుస్తుందని మేకర్స్‌ భావిస్తున్నారు.

సంబంధిత సమాచారం :