పుష్ప: సమంత స్పెషల్ సాంగ్ వచ్చేది ఎప్పుడంటే?

Published on Dec 8, 2021 10:01 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మికా మందన్నా హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ “పుష్ప”. పాన్‌ ఇండియన్ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుద‌ల చేయ‌నున్నారు. మొదటి భాగం “పుష్ప ది రైజ్” పేరుతో డిసెంబర్ 17 వ తేదిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ వస్తున్నాయి. అయితే తాజాగా సమంత స్పెషల్ సాంగ్‌పై మేకర్స్ అప్డేట్ ఇచ్చారు.

“ఊ అంటావా ఊ ఊ అంటావా” అంటూ సాగే ఈ మాస్ స్పెషల్ సాంగ్ లిరికల్ వీడియోను డిసెంబర్ 10వ తేదిన విడుదల చేయనున్నట్టు తెలిపారు. మాస్ పార్టీకి సిద్ధం కండి.. ‘సిజ్లింగ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్’ సమంత చలికాలంలో హీట్ పెంచుతుందని పేర్కొంటూ ఓ పోస్టర్‌ని రిలీజ్ చేసింది. ఈ పాటలో బన్నీ, సామ్ మాస్ స్టెప్పులతో ఇరగదీయబోతున్నట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :