రష్మీక, ఫాహద్, సుకుమార్ ల పై ఇంటర్వ్యూ విడుదల చేసిన పుష్ప టీమ్

Published on Dec 20, 2021 11:10 pm IST


అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని థియేటర్ల లో హౌజ్ ఫుల్ కలెక్షన్ల ను సాధిస్తుంది. ఈ చిత్రం విజయం కావడం పట్ల చిత్ర యూనిట్ ఒక ఇంటర్వ్యూ ను చేయడం జరిగింది. అందులో బన్నీ తో పాటుగా హీరోయిన్ రష్మీక, దేవీ శ్రీ ప్రసాద్, సుకుమార్ లు కూడా ఉన్నారు.

విడుదల అయిన ఈ సెకండ్ పార్ట్ లో రష్మీక, ఫాహద్, మరియు సుకుమార్ ల గురించి పలు విషయాలను వెల్లడించడం జరిగింది. ఈ చిత్రం లో ఫాహద్ విలన్ పాత్రలో నటించి కీ రోల్ పోషించారు. ఇందుకు సంబంధించిన సెకండ్ పార్ట్ పుష్ప ది రూల్ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది.

సంబంధిత సమాచారం :