ఆ ఒక్క షాట్ కోసం 12 గంటలు కష్టపడిన పుష్పరాజ్

Published on Jan 10, 2022 2:00 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ చిత్రం పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. సినిమా విడుదల అయిన తోలి రోజు నుండి ఇప్పటి వరకు కూడా ఎంతోమంది సినీ పరిశ్రమ కి చెందిన ప్రముఖులు సినిమా పై, అల్లు అర్జున్ నటన పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ కష్టపడిన విధానం ను మరొకసారి చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం జరిగింది.

అల్లు అర్జున్ ఫేవరేట్ సాంగ్ అయిన ఏయ్ బిడ్డా పాట లో ఒక షాట్ కోసం అల్లు అర్జున్ 12 గంటలు కష్ట పడ్డారు. మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 2 గంటల వరకు చేసినట్లు తెలుస్తోంది. 24 డ్రెస్సులు ఈ సీన్ కోసం ఉపయోగించిన విషయాన్ని వెల్లడించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హర్డ్ వర్క్ కి ఇదొక ఉదాహరణ అని చెప్పవచ్చు. ఇందుకు సంబంధించిన ఫోటో ను పుష్ప టీమ్ షేర్ చేయడం జరిగింది.

సంబంధిత సమాచారం :