ఫుల్ స్వింగ్ లో “పుష్ప” ప్రమోషన్స్…మూడవ సింగిల్ గ్లింప్స్ నేడు సాయంత్రం విడుదల!

ఫుల్ స్వింగ్ లో “పుష్ప” ప్రమోషన్స్…మూడవ సింగిల్ గ్లింప్స్ నేడు సాయంత్రం విడుదల!

Published on Oct 25, 2021 12:00 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం షూటింగ్ దాదాపు పూర్తి కాగా, ఈ డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. పుష్ప ది రైస్ అంటూ వస్తున్న ఈ మొడటి భాగం నుండి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, విడియో లు, పాటలు సినిమా పై భారీ అంచనాలను పెంచేశాయి. ఈ చిత్రం నుండి మూడవ సింగిల్ ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ఈ చిత్రం మూడవ సింగిల్ కి సంబందించిన గ్లింప్స్ నేడు సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం లో మలయాళ నటుడు ఫాహద్ విలన్ గా నటిస్తున్నారు. సుకుమార్, అల్లు అర్జున్, దేవీ శ్రీ ప్రసాద్ కాంబో లో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం నుండి విడుదల ప్రతి ఒక్క అప్డేట్ కూడా సోషల్ మీడియా ను, యూ ట్యూబ్ ను షేక్ చేయడం జరిగింది. ఈ మూడవ సింగిల్ ప్రేక్షకులను, అభిమానులను ఈ తరహాలో ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు