లేటెస్ట్..ఈ ఓటిటి సంస్థకి “పుష్ప” స్ట్రీమింగ్ రైట్స్.!

Published on Dec 18, 2021 7:02 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా సుకుమార్ తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ సినిమా “పుష్ప ది రైజ్”. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యిన ఈ చిత్రం ఆల్ మోస్ట్ సాలిడ్ టాక్ ని సినీ వర్గాల్లో తెచ్చుకొంది. అయితే డే 1 కి మాత్రం రికార్డు వసూళ్ళని ఈ చిత్రం ఖాయం అని టాక్ ఉండగా ఈ సినిమా ఓటిటి రైట్స్ పై లేటెస్ట్ బజ్ ఇప్పుడు తెలుస్తుంది.

దాని ప్రకారం ఈ సినిమా స్ట్రీమింగ్ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వారు కొనుగోలు చేశారట.. మరి ఇది అన్ని భాషలకి కలిపా లేక ఒక్క సౌత్ ఇండియన్ భాషలు వరకే సొంతం చేసుకున్నారా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. మరి ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందివ్వగా మైత్రి మూవీ మేకర్స్ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :