లేటెస్ట్..గాసిప్స్ పై “పుష్ప” ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ సాలిడ్ క్లారిటీ.!

Published on Dec 16, 2021 2:00 pm IST

ఈ ఏడాది టాలీవుడ్ సినిమా నుంచి వస్తున్న మరో భారీ సినిమా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన “పుష్ప”. పాన్ ఇండియన్ లెవెల్లో క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ అండ్ టీం అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కించిన ఈ చిత్రం రిలీజ్ దగ్గరకు వచ్చే సమయానికి పలు ఊహాగానాలకు ఇబ్బందులకు గురి కాక తప్పలేదు.

అయితే అలా స్ప్రెడ్ అవుతున్న కొన్ని గాసిప్స్ కి గాను పుష్ప ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ అయినటువంటి హంసిని ఎంటెర్టైన్మెంట్స్ వారు చెక్ పెట్టారు. ఎలాంటి రూమర్స్ కూడా ఎవరూ నమ్మవద్దని ఇంకొన్ని గంటల్లో “పుష్ప” ప్రీమియర్స్ చెప్పిన టైం కి ది ది బెస్ట్ గా ప్రెజెంట్ చేస్తున్నామని కన్ఫర్మ్ చేశారు.

అందుకు అందరి సహకారం ఉండాలని క్లారిటీ కూడా ఇచ్చారు. దీనితో పుష్ప ఓవర్సీస్ రిలీజ్ పై అందరికీ ఒక క్లారిటీ వచ్చినట్టేగా.. ఇక ఈ భారీ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందివ్వగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :