“పుష్ప” రాజ్ బాక్సాఫీస్ హంట్.. డే 4 నైజాంలో అదిరే వసూళ్లు.!

Published on Dec 21, 2021 10:00 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియన్ సినిమా “పుష్ప ది రైజ్” ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ గా ఈ ఏడాదిలో నిలిచింది. డే 1 నుంచే భారీ వసూళ్లు కొల్లగొడుతూ ఈ చిత్రం దూసుకెళ్తుంది. మరి ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా నాలుగో రోజు వసూళ్ల వివరాలు తెలుస్తున్నాయి.

మొదటి మూడు రోజులు వీకెండ్ లో సాలిడ్ కలెక్షన్ అందుకున్న పుష్ప రాజ్ సోమవారం వర్కింగ్ డే ఎలాంటి ఫిగర్స్ అందుకుంటాడా అనేది ఆసక్తిగా మారింది. మరి దానికి సమాధానంగా నైజాం లో నాలుగో రోజు మార్క్ తెలుస్తుంది. ఈ చిత్రం అక్కడ నాలగవ రోజు 3.45 కోట్ల షేర్ ని రాబట్టింది.

వర్కింగ్ డే లో ఇది పెద్ద మొత్తం అని చెప్పాలి. ఇక దీనితో నైజాం లో మొత్తం నాలుగు రోజులకి కలిపి 26.5 కోట్ల షేర్ వచ్చిందట. బయ్యర్లు కూడా లాభాల్లోకి వెళుతున్నారని తెలుస్తుంది. మొత్తానికి మాత్రం పుష్ప రాజ్ వేట ఫలితం మామూలుగా లేదని చెప్పాలి.

సంబంధిత సమాచారం :