నార్త్ లో మాత్రం నెక్స్ట్ లెవెల్ చూపిస్తున్న “పుష్ప”రాజ్.!

Published on Dec 25, 2021 10:00 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్న హీరోయిన్ గా క్రియేటివ్ దర్శకుడు తెరకెక్కించిన లేటెస్ట్ సినిమా “పుష్ప” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రాన్ని మేకర్స్ పాన్ ఇండియన్ వైడ్ రిలీజ్ చెయ్యగా అన్ని వైపులా సమాంతర రెస్పాన్స్ వచ్చింది.

అయితే నార్త్ లో మాత్రం పుష్ప రాజ్ వేరే లెవెల్ లో ఉందని చెప్పాలి. అక్కడ బాలీవుడ్ సినిమాలకు ఏ రకమైన స్థిరమైన రెస్పాన్స్ వస్తుందో ఆ రేంజ్ లో రెస్పాన్స్ ని పుష్ప రాజ్ అందుకొని ఆశ్చర్యపరుస్తున్నాడు. ముఖ్యంగా వీక్ డేస్ లో కూడా హౌస్ ఫుల్స్ పడుతుండడం గమనార్హం.

అంతే కాకుండా రోజుకి 3 కోట్ల నెట్ వసూళ్లు తగ్గకుండా వస్తుండడం అనేది మరో గొప్ప విషయం అని చెప్పాలి. అయితే దీనికి కారణం సినిమా బాగుండటం ఒకటి అయితే ఇంకో పెద్ద కారణం ఐకాన్ స్టార్ కి నార్త్ లో ఉన్న ఆదరణే అని చెప్పాలి. కేవలం తన క్రేజ్ మూలాన పుష్ప ఈ రేంజ్ లో నిలబడడం జరిగింది.

సంబంధిత సమాచారం :