యూఎస్ లో మరో మైల్ స్టోన్ బద్దలుకొట్టిన “పుష్ప” రాజ్.!

Published on Dec 24, 2021 11:00 am IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన లేటెస్ట్ సినిమా “పుష్ప ది రైజ్”. పాన్ ఇండియన్ వైడ్ సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. మరి గత వారం రిలీజ్ అయ్యిన ఈ చిత్రం ఒక్క ఇండియా లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా పుష్ప రాజ్ హవా వేరే లెవెల్లో ఉందని చెప్పాలి.

ప్రీ సేల్స్ లోనే రికార్డు బుకింగ్స్ తో భారీ ప్రీమియర్స్ అందుకున్న పుష్ప రాజ్ అనుకున్నట్టుగానే స్టాండర్డ్ గా బాక్సాఫీస్ దగ్గర నిలబడి మినిమమ్ లక్ష డాలర్స్ వసూలు చేస్తూ ఇప్పుడు 2 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసి ఐకాన్ స్టార్ మరో 2 మిలియన్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఫుల్ రన్ లో పుష్ప రాజ్ హంట్ ఎక్కడ ఆగుతుందో చూడాలి మరి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :