‘అఖండ’ తో ‘పుష్ప’ రాజ్ స్పెషల్ ఎపిసోడ్..ఈ డేట్ కి వస్తున్నారు.!

Published on Dec 21, 2021 11:47 am IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన భారీ సినిమా “అఖండ” సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ఈ చిత్రం నిలిచింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యాకనే మళ్ళీ తన మొట్ట మొదటి టాక్ షో “ఆహా” లో స్ట్రీమ్ అవుతున్న “అన్ స్టాప్పబుల్” తో బిజీ అయ్యారు. ఇక ఇది షురూ చేయడంతోనే మళ్ళీ టాలీవుడ్ బిగ్ స్టార్స్ తో అదిరే ఎపిసోడ్స్ ని స్టార్ట్ చేసేసారు.

ఇక ఇప్పుడు బాలయ్యతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పెషల్ ఎపిసోడ్ ముందుకు వస్తుండడం కన్ఫర్మ్ అయ్యింది. మరి ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఫోటోలు బయటికి వచ్చి వైరల్ అవుతుండగా ఈ స్పెషల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ కూడా కన్ఫర్మ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ ని ఈ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. మరి ఈ అఖండ, పుష్ప రాజ్ ల మళ్ళీ కలయిక ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ని అందిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :