మహేష్ కి స్పెషల్ థాంక్స్ తెలిపిన ‘పుష్ప’ రాజ్.!

Published on Jan 5, 2022 11:00 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ అండ్ ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా “పుష్ప ది రైజ్” రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మూవీ లవర్స్ ఈ సినిమా హిట్ ని ఎంజాయ్ చేస్తుండగా మరో పక్క అగ్ర సినీ తరాల నుంచి ఈ చిత్రానికి ప్రశంసలు కూడా ఇంకా వస్తూనే ఉన్నాయి.

మరి అలానే నిన్న రాత్రి మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా కూడా తన ఎగ్జైటింగ్ రెస్పాన్స్ ను సోషల్ మీడియా ద్వారా పంచుకోగా అది ఓ రేంజ్ లో వైరల్ అయ్యింది. మరి ఇప్పుడు మహేష్ స్పందనకు గాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన స్పందనను తెలియజేసాడు.

“నా నటన, మా పుష్ప వరల్డ్ లో పని చేసిన ప్రతి ఒక్కరి పనితనం మీకు నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది అని మీ హృదయ పూర్వక అభినందనలకు విధేయుడిగా ఉంటానని మహేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాని” పుష్ప రాజ్ తన స్పందనను వ్యక్తం చేసాడు. దీనితో ఇప్పుడు ఇరు హీరోల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :