సాలిడ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన “పుష్ప” రాజ్.!

Published on Dec 12, 2021 8:02 am IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్ లో నెవర్ బిఫోర్ మాస్ రోల్ లో తన హ్యాట్రిక్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన చిత్రం “పుష్ప”. సినిమా ఫస్ట్ లుక్ నుంచే సాలిడ్ హైప్ ని అందుకున్న ఈ చిత్రం ఎట్టకేలకు రిలీజ్ కి సన్నద్ధం అవుతుంది. పైగా వీరి నుంచి పాన్ ఇండియన్ వైడ్ రిలీజ్ కి సిద్ధం అయ్యిన సినిమా ఇది.

దీనితో హైప్ ఇంకో లెవెల్లో ఉంది. అయితే సినిమా షూటింగ్ గడుస్తున్నా కొద్దీ అనుకున్న డేట్ కి ఎలా అయినా సినిమా తీసుకురావాలని కాంక్ష తో మేకర్స్ లాస్ట్ రెండు నెలలు చాలా కష్టపడ్డారు. అందుకే ప్రమోషన్స్ కాస్త లేట్ అయినా లేటెస్ట్ గా స్టార్ట్ చేశారు.

లేటెస్ట్ గా ఐకాన్ స్టార్ మరియు హీరోయిన్ రష్మికా మందన్నా లు ప్రమోషన్స్ ని తెలుగు మరియు తమిళ్ లో స్టార్ట్ చేసినట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఆల్రెడీ తెలుగు మరియు తమిళ్ లో ఇంటర్వూస్ కంప్లీట్ చెయ్యగా మరిన్ని ఆసక్తికర అంశాలు రానున్న రోజుల్లో ఉండనున్నాయి.

సంబంధిత సమాచారం :