వరల్డ్ వైడ్ గా “పుష్ప” రిలీజ్ స్క్రీన్స్ కౌంట్ ఎంతంటే.!

Published on Dec 10, 2021 8:00 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ సినిమా “పుష్ప ది రైజ్”. మంచి అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం ఇంకొక్క వారంలో రిలీజ్ కానుంది. దీనితో రిలీజ్ పై మరింత ఆసక్తి ఇప్పుడు పెరుగుతుంది.

అయితే ఇపుడు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎన్ని వేల థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారో కౌంట్ తెలుస్తుంది. తాజా సోర్సెస్ ప్రకారం ఈ చిత్రం మొత్తం 3000కి పైగా స్క్రీన్స్ లో మొత్తం ఐదు భాషల్లో రిలీజ్ అవుతుందట. అలాగే ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం 1000 స్క్రీన్స్ కి పైగా స్క్రీన్స్ లో విడుదల అవుతున్నట్టుగా సమాచారం.

మొత్తానికి మాత్రం పాన్ ఇండియన్ లెవెల్లో పుష్ప మంచి కౌంట్ తో వస్తుంది. ఇక బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి లెక్కలను ఈ చిత్రం నమోదు చేస్తుందో చూడాలి. మరి ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా నిర్మాణం వస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :