అక్కడ “పుష్ప” రిలీజ్ ఓ రోజు ఆలస్యంగా.!

Published on Dec 17, 2021 9:00 am IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తన మరో హ్యాట్రి దర్శకుడు సుకుమార్ కాంబోలో చేసిన బిగ్గెస్ట్ సినిమా “పుష్ప ది రైజ్” ఈరోజు ఎట్టకేలకు భారీ స్థాయి రిలీజ్ అయ్యి యూనానిమస్ మౌత్ టాక్ ని తెచ్చుకుంటుంది. అయితే ఇదిలా ఉండగా ఈ చిత్రం రిలీజ్ ని పాన్ ఇండియన్ లెవెల్లో మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగు సహా తమిళ్, మళయాళం, కన్నడ హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యడానికి సిద్ధం చేశారు.

అయితే అనుకున్న డేట్ కి సినిమాని తీసుకు రావడానికి చాలా కష్టపడ్డా ఇప్పుడు మాత్రం ఓ భాషలో పుష్ప సినిమా వాయిదా అయ్యినట్టు తెలుస్తుంది. అదే మళయాళం లో. ఐకాన్ స్టార్ కి అక్కడ కూడా మంచి క్రేజ్ ఉంది కానీ పలు కారణాల చేత “పుష్ప” రిలీజ్ ఒక రోజు అక్కడ వాయిదా పడినట్టు తెలుస్తుంది. అంటే ఈ డిసెంబర్ 18 నుంచి మళయాళ వెర్షన్ వారికి అందుబాటులో ఉంటుందట. ఇక ఈ భారీ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :