రిలీజైన “పుష్ప” రష్యన్ లాంగ్వేజ్ ట్రైలర్!

Published on Nov 29, 2022 12:41 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప ది రైజ్ రష్యా లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి సిద్దం అవుతోంది. ఈ చిత్రం కి సంబంధించిన ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన రష్యన్ లాంగ్వేజ్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

డిసెంబర్ 8, 2022 న ఈ చిత్రం రష్యా లో విడుదల కాబోతుంది. అయితే స్పెషల్ ప్రీమియర్ డిసెంబర్ 1 మరియు 3 వ తేదీలలో చిత్ర యూనిట్ తో ప్రదర్షితమ్ కానున్నాయి. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అజయ్, అనసూయ భరద్వాజ్, సునీల్, ధనంజయ, రావు రమేష్, ఫాహద్ ఫజిల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :