రిలీజ్ కి రెడీ అవుతున్న జాలి రెడ్డి “బడవ రాస్కెల్” చిత్రం.!

రిలీజ్ కి రెడీ అవుతున్న జాలి రెడ్డి “బడవ రాస్కెల్” చిత్రం.!

Published on Jan 29, 2022 12:38 PM IST

రీసెంట్ టాలీవుడ్ సినిమా దగ్గర సాలిడ్ హిట్ అయ్యిన చిత్రాల్లో “పుష్ప” కూడా ఒకటి. మరి ఈ సినిమాలో జాలి రెడ్డి అనే ఇంట్రెస్టింగ్ రోల్ కనిపించిన కన్నడ స్టార్ నటుడు ధనుంజయ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ఇప్పుడు తెలుగులో రిలీజ్ కి రెడీ అవుతుంది. అదే కన్నడ లో బ్లాక్ బస్టర్ అయిన “బడవ రాస్కెల్”. దీనిని తెలుగులో విడుదల చెయ్యడానికి ఇపుడు సిద్ధం చేస్తున్నారు.

డాలీ పిక్చర్స్ మరియు రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ వారు సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. తెలుగు పలు విజయవంతమైన సినిమాలను చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్న రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ ఈ బ్లాక్ బస్టర్ సినిమా అందిస్తుండడం విశేషం.

తెలుగు లో భారీ విజయం సొంతం చేసుకున్న పుష్ప సినిమాలో జాలిరెడ్డి పాత్ర తో ప్రేక్షకులను అలరించిన ధనుంజయ్ ఈ సినిమా లో హీరో గా నటించగా అమృత అయ్యంగార్ హీరోయిన్ గా నటించింది. శ్రీమతి గీత శివరాజ్ కుమార్ సమర్పణలో ని ఈ సినిమాను శ్రీమతి సావిత్రమ్మ అడవి స్వామి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. శంకర్ గురు దర్శకత్వం వహించారు. తొందరలోనే ఈ సినిమా కు సంబందించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు