“పుష్ప” రాజ్ సెన్సేషన్ ఇంకా పెరుగుతుందట.!

Published on Jan 1, 2022 7:05 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియన్ సినిమా “పుష్ప ది రైజ్”. అన్ని అంచనాలు నడుమ ఈ సినిమా విడుదల అయ్యి అన్ని భాషల్లో కూడా సూపర్ హిట్ అయ్యింది. ముఖ్యంగా తెలుగు మరియు హిందీ భాషల్లో ఈ చిత్రం సాలిడ్ రన్ ని కనబరిచింది. హిందీలో అయితే స్టాండర్డ్ గా కంటిన్యూస్ వసూళ్లను అందుకొని అదరగొట్టింది.

అలాగే ఈ సినిమా డామినేషన్ అనుకున్న స్థాయికి మించే వచ్చింది. అయితే మొదట ఈ సినిమా బి టౌన్ లో 50 కోట్ల మేర వసూలు చేస్తుంది అని అంతా అనుకున్నారు కానీ ఈ మార్క్ ని సింపుల్ గా పుష్ప క్రాస్ చేస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అంతే కాకుండా ఫైనల్ గా అయితే 60 కోట్లకు పైగా దగ్గర వసూళ్లు అందుకున్నా ఆశ్చర్యం లేదని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి వేచి చూడాలి పుష్ప లెక్క ఎక్కడ ఆగుతుందో.

సంబంధిత సమాచారం :