ఓవర్సీస్ లో అరుదైన ఫీట్ సెట్ చేసిన “పుష్ప”..!

Published on Jan 6, 2022 12:00 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా “పుష్ప ది రైజ్” భారీ వసూళ్లను అందుకొని అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ తెలుగులో అయితే ఒక కొలిక్కి వచ్చి స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా ఈ భారీ సినిమా హిందీలో మాత్రం ఇంకా దుమ్ము లేపుతుంది.

అయితే ఇదిలా ఉండగా ఈ సినిమా మాత్రం ఇప్పుడు ఒక అరుదైన ఫీట్ ని అందులోని ఓవర్సీస్ మార్కెట్ లో సెట్ చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం రెండో వారానికన్నా మూడో వారంలో అధిక వసూళ్లను అందుకొని పుంజుకుందట.

ఇది ఓవర్సీస్ మార్కెట్ లో చాలా అరుదుగా జరిగే ఫీట్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి మాత్రం పుష్ప సినిమా ప్యూర్ హిట్ గా నిలిచింది. ఇక అంతా పార్ట్ 2 కోసమే వెయిట్ చెయ్యడం మిగిలి ఉందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :