పుష్ప సెకండ్ సింగిల్‌కి సమయం ఆసన్నమైందోచ్..!

Published on Oct 12, 2021 12:24 am IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మికా మందన్నా హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ చిత్రం ‘పుష్ప’. ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్‌కి విపరీతమైన రెస్పాన్స్ రాగా, సెకండ్ సింగిల్‌కి కూడా సమయం ఆసన్నమయ్యింది. అయితే మంచి అంచనాలు ఉన్న మెలోడీ సాంగ్ ‘శ్రీవల్లి’కి సంబంధించి 18 సెకన్ల పాటు ఉండే లిరికల్ ప్రోమో నేడు ఉదయం 11:07 నిమిషాలకు విడుదల కాబోతుంది.

అంతేకాకుండా అక్టోబర్ 13 బుధవారం రోజున ఉదయం 11:07 నిమిషాలకు ఫుల్ సాంగ్ రిలీజ్ కానుంది. అయితే ఈ పాటను తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో సిద్ శ్రీరామ్ ఆలపించగా, హిందీలో జావేద్ ఆలీ ఆలపించారు. ఏదేమైనా ఈ మ్యాజికల్ సాంగ్ ఎలా ఉండబోతుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలాఉంటే దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :