1 మిలియన్ లైక్స్‌ని కొల్లగొట్టిన పుష్ప “శ్రీవల్లి” సాంగ్..!

Published on Nov 17, 2021 1:04 am IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మికా మందన్నా హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ “పుష్ప”. పాన్‌ ఇండియన్ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుద‌ల చేయ‌నున్నారు. మొదటి భాగం “పుష్ప ది రైజ్” పేరుతో డిసెంబర్ 17 వ తేదిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే.

అయితే సెకండ్ సింగిల్‌గా వచ్చిన “శ్రీవల్లి” సాంగ్ యూట్యూబ్‌లో దుమ్మురేపుతుంది. ఇప్పటి వరకు ఈ పాట 60 మిలియన్స్‌కి పైగా వ్యూస్‌ని రాబట్టగా, తాజాగా 1 మిలియన్ లైక్స్‌ని కొల్లగొట్టింది. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ రాయగా, సిద్ శ్రీరామ్ ఆలపించాడు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More