వైరల్ : రష్యా మీడియాతో “పుష్ప” టీం ముచ్చట్లు.!

వైరల్ : రష్యా మీడియాతో “పుష్ప” టీం ముచ్చట్లు.!

Published on Nov 30, 2022 4:00 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా మన టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “పుష్ప” కోసం తెలిసిందే మరి గత ఏడాది రిలీజ్ అయ్యిన ఈ చిత్రం పాన్ ఇండియా వైడ్ సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. అలాగే ఇలా నిలవడమే కాకుండా నేషనల్ వైడ్ కూడా భారీ రీచ్ ని ఈ సినిమాలో బన్నీ మ్యానరిజమ్స్ కానీ దేవిశ్రీ ప్రసాద్ పాటలు గాని సొంతం చేసుకున్నాయి.

ఇక ఈ రీచ్ తో అయితే పుష్ప 1 ని రష్యా లో రిలీజ్ చేయడానికి సర్వం సిద్ధం చెయ్యగా అక్కడకి అయితే లేటెస్ట్ గా చిత్ర యూనిట్ అంతా పయనమయ్యారు. మరి అక్కడ నుంచి పలు ఫోటోలు కూడా బయటికి రాగ లేటెస్ట్ గా అయితే అక్కడి మీడియాతో ఐకాన్ స్టార్ మరియు రష్మిక లు కలిసి ముచ్చటించడం ఆ సంబంధిత పిక్స్ బయటకొచ్చి వైరల్ అవుతున్నాయి. మరి ఈ మీడియా మీట్ లో కూడా ఐకాన్ స్టార్ తన సిగ్నేచర్ మూమెంట్ ని చేయడం మంచి హైలైట్ గా కూడా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు