వైరల్: రష్యాలో ల్యాండ్ అయిన “పుష్ప” టీమ్!

Published on Nov 30, 2022 2:00 pm IST

డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప ది రైజ్ డిసెంబర్ 8, 2022న రష్యాలో గ్రాండ్ రిలీజ్ కానుంది. దీనికి ముందు, డిసెంబర్ 1 మరియు డిసెంబర్ 3 న వరుసగా మాస్కో మరియు సెయింట్ పీటర్స్‌బర్గ్‌లలో ఈ చిత్రం యొక్క ప్రత్యేక ప్రీమియర్‌లకు హాజరు కావడానికి, అల్లు అర్జున్, రష్మిక మందన్న మరియు సుకుమార్ బృందం రష్యాకు వెళ్లింది.

ఈ ముగ్గురికి రష్యాలోని సినిమా డిస్ట్రిబ్యూటర్లు ఘన స్వాగతం పలికారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యాయి. పుష్ప ది రైజ్ అనేది పవర్ ఫుల్ యాక్షన్ డ్రామా, ఇందులో సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, ధనంజయ, ఫాహద్ ఫజిల్ కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించిన ఈ బిగ్గీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.

సంబంధిత సమాచారం :