భారీ రెస్పాన్స్ తో దూసుకెళ్తున్న “పుష్ప” తెలుగు, హిందీ ట్రైలర్స్!

Published on Dec 8, 2021 12:00 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ మైండ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ చిత్రం “పుష్ప”. మరి వీరి కెరీర్ లో మంచి ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ గా వస్తున్న ఈ చిత్రం నుంచి మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ ని మేకర్స్ మొదటా నాలుగు భాషల్లో మొన్న రిలీజ్ చెయ్యగా హిందీలో నిన్న రిలీజ్ చేసారు.

అయితే ఈ ట్రైలర్ మాత్రా తెలుగు మరియు హిందీ భాషల్లో సాలిడ్ రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది. టాలీవుడ్ లో అయితే ఇప్పుడు 20 మిలియన్ వ్యూస్ కి దగ్గరగా ఉండగా మరో ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్డ్ ట్రైలర్ గా నిలిచే దిశగా వెళుతుంది.

అలాగే హిందీ వెర్షన్ కి వస్తే 24 గంటలు దాటకుండానే 5 మిలియన్ వ్యూస్ ఆల్రెడీ క్రాస్ చేసి హాఫ్ మిలియన్ లైక్స్ కి దగ్గరలో ఉంది. దీనితో పుష్ప పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక రిలీజ్ అయ్యాక పుష్ప మాస్ పార్టీ ఎలా ఉంటుందో చూడాలి. అది తెలియాలి అంటే వచ్చే డిసెంబర్ 17 వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :