ఇంకా కొనసాగుతున్న “పుష్ప” ఆల్బమ్ హవా.!

Published on Mar 25, 2022 7:02 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “పుష్ప”. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ భారీ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యి భారీ బ్లాక్ బస్టర్ అయ్యింది. మరి ఈ సినిమాలో ఉన్న ఎన్నో హైలైట్స్ లో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన హిట్ ఆల్బమ్ కూడా ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

అలాగే ఈ సినిమాతో అల్లు అర్జున్ లాస్ట్ సినిమా “అల వైకుంఠపురములో” చిత్రం ఆల్బమ్ తోని అలాగే ఇపుడు “పుష్ప” బ్యాక్ టు బ్యాక్ బాక్సాఫీస్ హిట్స్ తో పాటు సెన్సేషనల్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. అప్పుడు ఆ సినిమా ఎలా అయితే కొన్నాళ్ల పాటు ఆడీయో పరంగా హవా కొనసాగించిందో అలాగే ఇప్పుడు పుష్ప కూడా కొనసాగిస్తోంది.

రీసెంట్ గానే ఐటెం సాంగ్ 200 మిలియన్ వ్యూస్ అందుకోగా ఇప్పుడు పుష్ప శ్రీవల్లి లిరికల్ సాంగ్ తెలుగులో 150 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి భారీ రికార్డు అందుకుంది. ఇలా ఇప్పటికీ ఈ మ్యాజికల్ ఆల్బమ్ హవా కొనసాగిస్తోంది.

సంబంధిత సమాచారం :