లేటెస్ట్..సెన్సార్ కంప్లీట్ చేసుకున్న “పుష్ప ది రైజ్”.!

Published on Dec 10, 2021 10:44 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ సినిమా “పుష్ప ది రైజ్”. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం వచ్చే డిసెంబర్ 17 న పాన్ ఇండియన్ లెవెల్లో రిలీజ్ కి రెడీగా ఉంది. ఇప్పటికే ట్రైలర్ పాటలతో ఆకట్టుకున్న ఈ చిత్రం రిలీజ్ కి సన్నద్ధం అవుతున్న ఈ గ్యాప్ లో తన సెన్సార్ పనులను కూడా ముగించేసుకుంది.

మరి ఈ చిత్రానికి గాను సెన్సార్ బోర్డు వారు యూ/ఏ సర్టిఫికెట్ ని ఇచ్చినట్టుగా మేకర్స్ అధికారికంగా తెలిపారు. ఇక దీనితో ఈ మాస్ మసాలా చిత్రం డిసెంబర్ 17న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి రెడీ అయ్యిపోయింది అని కన్ఫర్మ్ చేశారు. మరి బన్నీ సుకుమార్ ల కాంబో నుంచి వస్తున్న ఈ హ్యాట్రిక్ సినిమా అన్ని అంచనాలకు ధీటుగా ఉంటుందా లేదా అనేది తెలియాలి అంటే ఇక వచ్చే వారం రోజులు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :