నార్త్ లో పుష్పరాజ్ సెన్సేషనల్ రికార్డ్…100 కోట్ల క్లబ్ లోకి

Published on Jan 31, 2022 12:01 am IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప ది రైజ్. ఈ చిత్రం డిసెంబర్ 17 వ తేదీన థియేటర్ల లో విడుదల అయ్యి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. పాన్ ఇండియా మూవీ గా విడుదల అయిన ఈ చిత్రానికి సర్వత్రా పాజిటివ్ టాక్ రావడం విశేషం. ఈ చిత్రం సౌత్ మరియు హిందీ బాషల్లో ఓటిటి లో అందుబాటులో ఉన్నా కూడా మంచి వసూళ్లను రాబడుతోంది.

తాజాగా ఈ చిత్రం హిందీ లో 100 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం జరిగింది. అల్లు అర్జున్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కి ఈ తరహా రెస్పాన్స్ రావడం సెన్సేషన్ అని చెప్పాలి. ఈ చిత్రం లో రష్మీక మందన్న హీరోయిన్ గా నటించగా, సమంత స్పెషల్ సాంగ్ లో నటించడం జరిగింది. సునీల్, అనసూయ భరద్వాజ్, అజయ్ ఘోష్, ఫహద్ ఫజిల్ తదితరులు ఈ చిత్రం లో కీలక పాత్రల్లో నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం రెండవ భాగం పుష్ప ది రూల్ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

సంబంధిత సమాచారం :