బాలీవుడ్ లో కొనసాగుతున్న పుష్పరాజ్ హవా..!

Published on Dec 29, 2021 6:00 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ చిత్రం పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకు పోతుంది. పాన్ ఇండియా మూవీ గా విడుదల అయిన ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. ప్రత్యేకం గా కరోనా వైరస్ లాంటి పరిస్థితులను ఎదుర్కొన్న తర్వాత బాలీవుడ్ లో ఈ తరహా వసూళ్లను సాధించడం తో మరొకసారి తెలుగు సినిమా నార్త్ లో ఆధిపత్యం చూపిస్తోంది అని చెప్పాలి.

ఇప్పటి వరకు పుష్ప చిత్రం బాలీవుడ్ లో 42 కోట్ల రూపాయల కి పైగా వసూళ్లను సాధించడం జరిగింది. పలు చోట్ల 50 శాతం ఆక్యుపన్సి ఉన్నప్పటికీ చాలా స్ట్రాంగ్ హోల్డ్ చేయడం మామూలు విషయం కాదు. ప్రస్తుతం ఉన్న దూకుడు తో త్వరలో ఈ చిత్రం 50 కోట్ల రూపాయల కి చేరే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో సైతం మంచి వసూళ్ళను రాబడుతున్న పుష్ప లాంగ్ రన్ లో ఎంత వసూలు చేస్తుందొ చూడాలి.

రష్మీక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో సమంత స్పెషల్ సాంగ్ లో నటించడం జరిగింది. సునీల్, అనసూయ భరద్వాజ్, ఫాహద్, ధనంజయ కీలక పాత్రల్లో నటించగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించడం జరిగింది. ఈ చిత్రం కి సంబంధించిన రెండవ పార్ట్ పుష్ప ది రూల్ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది.

సంబంధిత సమాచారం :