అక్కడ దంచి కొడుతున్న పుష్ప…బాలీవుడ్ లో 70 కోట్ల కి చేరువలో..

Published on Jan 5, 2022 10:02 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప ది రైజ్. మైత్రి మూవీ మేకర్స్ మరియు ముత్తం శెట్టి మీడియా సంయుక్తం గా నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందించారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా, సమంత స్పెషల్ సాంగ్ లో ఆడి పాడింది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఈ చిత్రం విడుదల అయిన అన్ని చోట్ల భారీ వసూళ్లను రాబడుతోంది. బాలీవుడ్ లో సైతం ఈ చిత్రం 68 కోట్ల రూపాయల కి పైగా వసూళ్లను రాబట్టింది. ముఖ్యం గా ఈ చిత్రం మహారాష్ట్ర మరియు గుజరాత్ లో మంచి రెస్పాన్స్ ను రాబడుతోంది. పాన్ ఇండియా మూవీ గా విడుదల అయిన ఈ చిత్రం జనవరి 7 వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో లోకి రానుంది.

సంబంధిత సమాచారం :