రెండోసారి టీఆర్పీ బ్లాస్ట్ కి “పుష్ప” రాజ్ సిద్ధం.!

Published on Apr 23, 2022 12:01 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా మన టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ హిట్ సినిమా “పుష్ప ది రైజ్”. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యిన ఈ సినిమా అన్ని భాషల్లో కూడా సాలిడ్ హిట్ అయ్యి అల్లు అర్జున్ రియల్ స్టార్డం ని ప్రూవ్ చేసింది.

మరి సమాన తెలుగులో కూడా బాక్సాఫీస్ దగ్గర మాత్రమే కాకుండా స్మాల్ స్క్రీన్ పై కూడా సాలిడ్ టీఆర్పీ ని ఫస్ట్ టైం టెలికాస్ట్ లో రాబట్టి అదరగొట్టింది. మరి ఇప్పుడు మళ్ళీ రెండోసారి టెలికాస్ట్ కి ఈ సినిమా సిద్ధంగా ఉంది. ఈ ఏప్రిల్ 24 ఆదివారం సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకి ఇదే స్టార్ మా లో సెకండ్ టెలికాస్ట్ కి ఈ చిత్రం సిద్ధంగా ఉంది.

మన తెలుగు నుంచి రెండో టెలికాస్ట్ లో కూడా పలు సినిమాలకి సాలిడ్ రికార్డులు ఉన్నాయి. మరి వాటిలో పుష్ప కూడా ఏమన్నా మ్యాజిక్ నమోదు చేస్తుందేమో చూడాలి. ఇక ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ రెండు భాగాలుగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :