లేటెస్ట్: అక్కడ గ్రాండ్ రిలీజ్ కి రెడీ అయిన “పుష్ప”

లేటెస్ట్: అక్కడ గ్రాండ్ రిలీజ్ కి రెడీ అయిన “పుష్ప”

Published on Nov 28, 2022 5:00 PM IST

గ్లోబల్ బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ విడుదలై జపాన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇప్పుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రైజ్ రష్యాలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియన్ మూవీ గత ఏడాది విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ రోజు, మైత్రీ మూవీ మేకర్స్ తాజాగా ఒక ప్రకటన చేయడం జరిగింది.

రష్యన్ డబ్బింగ్ వెర్షన్ డిసెంబర్ 8, 2022న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అల్లు అర్జున్‌తో సహా పుష్ప టీమ్ వరుసగా డిసెంబర్ 1 మరియు 3వ తేదీల్లో మాస్కో మరియు సెయింట్ పీటర్స్‌ బర్గ్‌ లలో గ్రాండ్ ప్రీమియర్‌లకు హాజరు కానుంది. పుష్పలో రష్మిక మందన్న కథానాయికగా నటించింది. ఇందులో జగదీష్, అనసూయ భరద్వాజ్, సునీల్, రావు రమేష్, ఫాహద్ ఫజిల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ బ్లాక్ బస్టర్ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు