పుష్ప హిందీ వెర్షన్ అమెజాన్ లో ఫిక్స్… ఎప్పటినుండి అంటే?

Published on Jan 10, 2022 5:50 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప ది రైజ్. రష్మీక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ను మైత్రి మూవీ మేకర్స్ మరియు ముత్తంశెట్టి మీడియా సంయుక్తం గా నిర్మించడం జరిగింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం లో సునీల్, అనసూయ భరద్వాజ్, ఫాహద్ ఫజిల్, ధనంజయ, అజయ్ ఘోష్ లు కీలక పాత్రల్లో నటించారు.

ఈ చిత్రం బాలీవుడ్ లో సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకూ 80 కోట్ల రూపాయల కి పైగా వసూళ్లను సాధించి సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ చిత్రం ఇప్పటికే సౌత్ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో లో అందుబాటులోకి రాగా, తాజాగా హిందీ వెర్షన్ పై ఒక క్లారిటీ వచ్చింది. ఈ చిత్రం హిందీ వెర్షన్ జనవరి 14 వ తేదీ నుండి అమెజాన్ లో అందుబాటులోకి రానుంది.

సంబంధిత సమాచారం :