అక్కడ “పుష్ప ది రైజ్” రచ్చ షురూ చేశారట.!

Published on Dec 3, 2021 10:01 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రాన్ని మేకర్స్ రిలీజ్ కి రెడీ చేస్తుండగా ఈ గ్యాప్ లో సాలిడ్ ప్రమోషన్స్ కి రంగం సిద్ధం చేశారు. మరి అందులో భాగంగా పుష్ప ని నార్త్ ఆడియెన్స్ లో దగ్గర చేసే పనులు స్టార్ట్ చేశారట.

అక్కడ ఆల్రెడీ భారీ ప్రమోషనల్ ప్లాన్స్ సిద్ధం చేయగా పుష్ప హిందీ వెర్షన్ టీజర్ ని ఆల్రెడీ థియేట్రికల్ గా చూపించడం స్టార్ట్ చేశారట. అల్లు అర్జున్ కెరీర్ లో చాలా కీలకంగా మారింది హిందీ మార్కెట్. అక్కడ తన సినిమాలకు స్మాల్ స్క్రీన్ పై అక్కడి స్టార్ హీరోలతో సమానంగా ఆదరణ అభిమానం ఉంది.

మరి అది థియేట్రికల్ గా ఎలా ఉంటుంది అనేది “పుష్ప” తో ఆసక్తిగా మారింది. అందుకే ఈ సినిమా రిలీజ్ హిందీలో చాలా ప్రత్యేకం అని చెప్పాలి. దానికి సమయం ఎంతో దూరంలో కూడా లేదు మరి వేచి చూడాలి బన్నీ కి సాలిడ్ వెల్కమ్ దక్కుతుందో లేదో.

సంబంధిత సమాచారం :