తోటి దర్శకులతో “పుష్ప” సక్సెస్‌ని ఎంజాయ్ చేసిన సుకుమార్..!

Published on Dec 27, 2021 11:52 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియన్ లెవల్లో తెరకెక్కించిన “పుష్ప ది రైజ్”. దిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుని రికార్డ్ స్థాయిలో వసూళ్లను రాబడుతుంది. ఇక ఆర్ఆర్ఆర్ వచ్చే వరకు కూడా పుష్ప జోరు తగ్గదే లే అన్నట్టు కొనసాగడం ఖాయంగా అనిపిస్తుంది.

ఇదిలా ఉంటే పుష్ప బ్లాక్ బస్టర్ అయిన సందర్భంగా సుకుమార్ తన తోటి దర్శకులకు పార్టీ ఇచ్చాడు. అందరితో కలిసి పుష్ప సక్సెస్‌ని ఎంజాయ్ చేశారు. ఈ పార్టీలో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు, సందీప్ రెడ్డి వంగా, కొరటాల శివ, గోపీచంద్ మలినేని, రాధా కృష్ణ కుమార్, శివ నిర్వాణ, రాహుల్ సంకృత్యాన్, మున్నా, సంపత్ నంది, ఇంద్రగంటి మోహనకృష్ణ, బుచ్చిబాబు తదితరులు ఈ పార్టీకి హాజరయ్యారు.

సంబంధిత సమాచారం :