‘పుష్ప – ది రైజ్’ రష్యన్ లాంగ్వేజ్ ట్రైలర్ రిలీజ్ టైం ఫిక్స్

‘పుష్ప – ది రైజ్’ రష్యన్ లాంగ్వేజ్ ట్రైలర్ రిలీజ్ టైం ఫిక్స్

Published on Nov 29, 2022 1:14 AM IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ మూవీ పుష్ప ది రైజ్. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. గత ఏడాది డిసెంబర్ లో మంచి అంచనాలతో పలు భాషల్లో రిలీజ్ అయిన ఈ మూవీ ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని ఎంతో ఆకట్టుకుని భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ మూవీకి సుకుమార్ సూపర్ టేకింగ్ తో పాటు అల్లు అర్జున్ వండర్ఫుల్ పెర్ఫార్మన్స్, రాక్ స్టార్ దేవిశ్రీ అదిరిపోయే సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి తొడై మూవీని ఎంతో పెద్ద సక్సెస్ చేసాయి.

అయితే విషయం ఏమిటంటే, రిలీజ్ అనంతరం అనేక ఇతర దేశాల ఆడియన్స్ ని ఆకట్టుకున్న పుష్ప మూవీని డిసెంబర్ 8న రష్యన్ లాంగ్వేజ్ లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. కాగా రష్యన్ లాంగ్వేజ్ ట్రైలర్ ని నేడు ఉదయం 11 గం. 07 ని. లకు రిలీజ్ చేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ మూవీ పై రష్యన్ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉండడంతో తప్పకుండా పుష్ప అక్కడ కూడా ఘన విజయం అందుకోవడం ఖాయం అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తోంది యూనిట్. ఇక పుష్ప రష్యన్ స్పెషల్ ప్రీమియర్స్ ని డిసెంబర్ 1 న మాస్కో, అలానే డిసెంబర్ 3 న సెయింట్ పీటర్స్ బర్గ్ లలో ప్రదర్శించనున్నారు. కాగా ఈ ప్రీమియర్స్ లో క్యాస్ట్ అండ్ క్రూ పాల్గొననున్నారు. కాగా పుష్ప ది రైజ్ మూవీ డిసెంబర్ 8న రష్యాలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు