కాస్త ముందుగానే ప్రైమ్ వీడియో లోకి వచ్చేసిన “పుష్ప ది రైజ్”

Published on Jan 7, 2022 7:52 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం పుష్ప ది రైజ్. మైత్రి మూవీ మేకర్స్ మరియు ముత్తంశెట్టి మీడియా ఈ చిత్రాన్ని సంయుక్తం గా నిర్మించడం జరిగింది. రష్మీక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందించారు. సునీల్, అనసూయ భరద్వాజ్, ఫాహద్ ఫజిల్, ధనంజయ, అజయ్ ఘోష్ లు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో లో ప్రసారం అవుతోంది.

నేడు రాత్రి 8 గంటల సమయం నుండి ప్రసారం కావాల్సి ఉండగా, కాస్త ముందుగానే వచ్చేసింది. పుష్ప ది రైజ్ అమెజాన్ ప్రైమ్ వీడియో లోకి రావడం తో ప్రేక్షకులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీ గా విడుదల అయిన ఈ చిత్రం మిగతా బాషల్లో కూడా ప్రేక్షకుల కి అమెజాన్ ప్రైమ్ వీడియో లో అందుబాటులొ ఉంది.

సంబంధిత సమాచారం :