వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా పుష్ప…ఎప్పుడంటే!

Published on Mar 6, 2022 3:04 pm IST


అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప ది రైజ్. పాన్ ఇండియా మూవీ గా విడుదల అయిన ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించి, సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా సైతం ప్రేక్షకుల ముందుకు వచ్చి విశేషం గా ఆకట్టుకుంటుంది. అయితే ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు సిద్దం అవుతుంది.

ఈ చిత్రం వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకు స్టార్ మా లో ప్రసారం కానుంది. బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతుంది. ఈ చిత్రం లో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా రష్మీక మందన్న నటించగా, సమంత స్పెషల్ సాంగ్ లో నటించడం జరిగింది. అనసూయ భరద్వాజ్, సునీల్, ధనంజయ, అజయ్ ఘోష్, ఫాహద్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందించారు. ఈ చిత్రం రెండవ భాగం పుష్ప ది రూల్ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

సంబంధిత సమాచారం :