రికార్డు స్థాయి ఫిగర్ ని టచ్ చేసిన “పుష్ప” టోటల్ బిజినెస్.!

Published on Dec 12, 2021 12:00 am IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ మరియు దేవిశ్రీ ప్రసాద్ ల సెన్సేషనల్ కాంబో నుంచి వస్తున్న హ్యాట్రిక్ సినిమా “పుష్ప ది రైజ్”. ఓ హ్యాట్రిక్ సినిమాకి కావాల్సిన అన్ని హంగులతో కూడా రెడీ అయ్యిన ఈ చిత్రం టోటల్ బిజినెస్ మార్క్ ఇప్పుడు తెలుస్తుంది.

ఈ సినిమా మొత్తం ఐదు భాషల్లో థియేట్రికల్ మరియు నాన్ థియేట్రికల్ హక్కులు సహా ఓటిటి హక్కులు కలిపి రికార్డు ఫిగర్ 250 కోట్లు బిజినెస్ ని జరిపినట్టుగా ఇండస్ట్రీ నుంచి సమాచారం. అల వైకుంఠపురములో లాంటి భారీ హిట్ తర్వాత చేసిన పుష్ప తో బన్నీ కి ఇది అతి పెద్ద బిజినెస్ అని చెప్పాలి.

అలాగే దీనిని బట్టి ఈ సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో కూడా మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించగా, స్టార్ హీరోయిన్ సమంతా ఒక స్పెషల్ సాంగ్ ని చేసింది. అలాగే మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత సమాచారం :