తెలుగులో రికార్డ్ టీఆర్పీ నమోదు చేసిన “పుష్ప” రాజ్.!

Published on Mar 24, 2022 1:04 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా “పుష్ప ది రైజ్”. అల్లు అర్జున్ మరియు సుకుమార్ సహా దేవిశ్రీ ప్రసాద్ ల కెరీర్ లో భారీ స్థాయి హిట్ గా నిలిచిన ఈ చిత్రం సిల్వర్ స్క్రీన్ పై హిట్ అయ్యి సాంగ్స్ మ్యానరిజమ్స్ లో ఇప్పటికీ ట్రెండ్ గా నడుస్తుంది.

మరి ఇలా సెన్సేషన్ ని నమోదు చేసిన ఈ సినిమా తెలుగులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా గత మార్చ్ 13న స్టార్ మా టెలికాస్ట్ కాగా ఇప్పుడు రికార్డు టీఆర్పీ ని నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. మన టాలీవుడ్ లో టాప్ 5 లో ఒకటిగా నిలిచింది. ఇంతకీ ఈ సినిమాకి ఎంత రేటింగ్ వచ్చిందంటే 22.5 టీఆర్పీ పాయింట్స్ వచ్చిందట. దీనితో ఇది ఆల్ టైం 5 గా సరికొత్త రికార్డు నమోదు చేసింది. అయితే టాప్ 1 లో మాత్రం బన్నీ సినిమా “అల వైకుంఠపురములో” నే ఉంది.

సంబంధిత సమాచారం :