‘పుష్ప – ది రూల్’ షూటింగ్ అప్ డేట్

‘పుష్ప – ది రూల్’ షూటింగ్ అప్ డేట్

Published on Nov 1, 2022 1:00 AM IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కి గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయిన పాన్ ఇండియన్ మూవీ పుష్ప ది రైజ్. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ మూవీ అతి పెద్ద విజయం అందుకున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని భాషల ఆడియన్స్ నుండి సూపర్ క్రేజ్ అందుకున్న పుష్ప ది రైజ్ మూవీతో హీరోగా అల్లు అర్జున్ మంచి పాపులారిటీ సంపాదించారు.

దానితో అందరిలో దాని సీక్వెల్ అయిన పుష్ప ది రూల్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే విషయం ఏమిటంటే, ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకున్న పుష్ప ది రూల్ మూవీ నవంబర్ 7 న షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ పార్ట్ ని మించేలా మరింత భారీ యాక్షన్ థ్రిల్లింగ్ అంశాలతో దర్శకుడు సుకుమార్ ఈ మూవీ యొక్క స్టోరీ, స్క్రిప్ట్ ని సిద్ధం చేశారట. కాగా ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు దీనిని ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు