అక్కడ మరోసారి భారీ స్థాయిలో “పుష్ప” రిలీజ్.!

Published on Jan 5, 2022 9:00 am IST

ఐకాన్ స్టార్ బ్యాక్ టు బ్యాక్ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ ని ఇప్పుడు తన ఖాతాలో వేసుకున్నాడు. కాస్త లేట్ గానే వచ్చినా లేటెస్ట్ గా తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ని అల్లు అర్జున్ తన “పుష్ప” తో అందుకున్నాడు. అప్పుడు ఎలా అయితే “అల వైకుంఠపురములో” తో రీసౌండింగ్ హిట్ ని టాలీవుడ్ లో అందుకున్నాడో ఇప్పుడు టోటల్ పాన్ ఇండియా వైడ్ తన స్టామినా చూపించాడు.

మరి ఒక్క మన దేశంలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం దమ్ము చూపించింది. మరి ఇదే ఓవర్సీస్ లో ఈ చిత్రం మరో సారి భారీ స్థాయిలో రిలీజ్ కావడానికి రెడీ అయ్యినట్టు తెలుస్తుంది. అయితే ఈసారి పుష్ప హిందీ వెర్షన్ లో అక్కడ రిలీజ్ కానుంది అట.

అలాగే ఏదైతే తెలుగులో సినిమాని అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసారో అదే హంసినీ ఎంటర్టైన్మెంట్ వారు క్లాసిక్ ఎంటర్టైన్మెంట్స్ వారితో కలిసి పెద్ద ఎత్తునే స్క్రీన్స్ లో విడుదల చేయబోతున్నారట. మరి సుకుమార్ తెరకెక్కించిన ఈ స్టెల్లార్ సినిమాకి హిందీ వెర్షన్ లో అక్కడ ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :